ఓటర్లకు పంచేందుకు ముక్కుపుడకలు.. పట్టుకున్న పోలీసులు

278

ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉండటంతో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం కడప నగర శివారులోని ఇర్కాన్ సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ వాహనంలో తరలిస్తున్న 987 బంగారు ముక్కుపుడకలను గుర్తించారు. నగరంలోని 37 డివిజన్‌లో పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థి తనయుడు ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తుంగా చెన్నూరు పోలీసులు పట్టుకున్నారు. కాగా ఈ విషయాన్ని ఇంత వరకు పోలీసులు ప్రకటించలేదు. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి ఉండటంతో పోలీసులు ఈ విషయాన్నీ బయటపెట్టలేదని తెలుస్తుంది.

ఓటర్లకు పంచేందుకు ముక్కుపుడకలు.. పట్టుకున్న పోలీసులు