రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు

249

న్యాయవాద దంపతుల హత్యోదంతంపై మండిపడుతున్నారు తెలంగాణ ప్రజలు.. నిందితులను పట్టుకొని విచారించి వారి వెనుక ఉన్న వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తమ తోటి న్యాయవాది హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి కోర్టుల్లో విధుల బహిష్కరణ చేసి ఆందోళన చేపట్టారు. నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు చేశారు.

ఇదిలా ఉంటే ఈ హత్యకేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న కుంట శ్రీనివాస్ మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. ఓ వ్యక్తిని చంపేదుకు ఆయన 50 లక్షలు సఫారీ కుదుర్చుకున్న ఆడియో బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో ఓ ఎమ్మెల్యే పేరు కూడా ప్రస్తావించారు. ఎమ్మెల్యేకు అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో వేరే వ్యక్తిని హత్య చేసేందుకు శ్రీనివాస్ ఎమ్మెల్యే అనుచరుడితో సఫారీ కుదుర్చుకున్నట్లుగా ఈ ఆడియో వింటే అర్ధమవుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన న్యాయవాదులు