జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్‌!

268

కరోనా కాలంలో ఎక్కువగా వీడియో కాలింగ్ యావ్స్ ద్వారానే మీటింగ్స్ జరిగాయి. కోర్టు వాదనలు కూడా అంతర్జాలంలోనే జరిగాయి.. ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఈ మాధ్యమాల ద్వారా జరుగుతున్న కార్యక్రమాల్లో హాస్యం తెప్పించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో ఓ ప్రొఫెసర్ జీఎస్టీపై సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో వెనకనుండి అతడి భార్య వచ్చి ముద్దు పెట్టబోయింది.. ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అయింది. ఇక తాజాగా మరో ఘటన జరిగింది. ఓ న్యాయవాది జూమ్ కాల్ కొనసాగుతుందటనే భోజనం చేస్తూ సోలిసెటర్ జనరల్ ఆఫ్ ఇండియా కంటపడ్డారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా బీహార్ లోని పాట్నాకు చెందిన ఓ న్యాయవాది జూమ్ వీడియో ద్వారా విచారణలో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో సొలిసేటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తుషార్‌ మెహతా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయవాది తన వాదనలు వినిపించారు. వాదనలు పూర్తైన వెంటనే భోజనం మొదలు పెట్టారు. కానీ కెమెరా ఆపలేదు.. కెమెరా ఆపాలని సోలిసెటర్ జనరల్ అనేకసార్లు చెప్పినా వినిపించలేదు. దింతో సోలిసెటర్ జనరల్ న్యాయవాదికి ఫోన్ చేసి వీడియో నిలిపివేయాలని చెప్పారు.

దింతో కంగారు పడిన న్యాయవాది వీడియో ఆపేసాడు.. ఈ నేపథ్యంలోనే ఎస్‌జీఐ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. ఆ భోజనం తనకూ పంపమని సరదాగా వ్యాఖ్యానించారు. మరోవైపు జూమ్‌కాల్‌లో ఉన్న మిగతా సభ్యులు న్యాయవాది చేసిన పనికి పగలబడి నవ్వారు.

 

జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్‌!