Latest update: మహేష్ ‘SVP’ రిలీజ్ డేట్.. ఫ్యాన్స్ ఖుష్!

376

Latest update: తెలుగు సినీ అభిమానులకు ఈరోజు వరసగా పండగ చేసుకొనే వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈరోజు మెగాస్టార్ ఆచార్య టీజర్ తెగ వైరల్ అవుతుండగా తానెందుకు సైలెంట్ ఉండాలని మహేష్ కూడా వచ్చేశాడు. అయితే.. మహేష్ ఒక పోస్టర్.. రిలీజ్ డేట్ ఇచ్చేసి అభిమానులను ఖుష్ చేశాడు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా ప్రకటించగా ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం ఆసక్తి కలిగిస్తుంది.

ఈ పోస్టర్ లో మహేష్ ప్రభుత్వ కార్యాలయంలో ఉపయోగించే ఓ భారీ తాళాల గుత్తి చేతబట్టి కనిపించాడు. కుంభకోణాలు, ఆర్ధిక నేరాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ఒక ప్రచారం జరుగుతుండగా ఈ పోస్టర్ తో అదే నిజమని సినీ అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. కాగా.. అభిమానులు తెగ నచ్చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యూనిట్ ఈ పోస్టర్ ట్విట్టర్ లో విడుదల చేసిన కాసేపటికే రీ ట్వీట్ల వర్షం మొదలైంది.