ఏపీలో భూముల రీసర్వేకు సీఎం జగన్‌ శ్రీకారం

56

ఏపీలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో ఉన్న భూములను రీసర్వే చేయడానికి వైఎస్సార్‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేను ప్రారంభించారు సీఎం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో సమగ్ర భూ సర్వే జరగనుంది.. ఇందులో మొత్తం 1.26 కోట్ల హెక్టార్ల భూమిని రీసర్వే చేయనున్నారు.