లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం, ఎయిమ్స్ కు తరలింపు

240

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి క్షిణించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు లాలూ. శనివారం ఆయనకు చూసేందుకు భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్ వచ్చారు. కాగా లాలూ ప్రసాద్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. కిడ్నీల పనితీరు కూడా 25 శాతం మాత్రమే పనిచేస్తున్నట్లు… న్యూమోనియా కూడా ఉండడంతో..

శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేజస్వియాదవ్ మీడియాకు తెలిపారు. లాలూ ఆరోగ్యపరిస్థితిపై అధికారులు మాట్లాడుతూ ఆయనను ఎయిమ్స్ కు తరలిస్తామని తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి.. దిగువ కోర్టు అనుమతితోపాటు, వైద్య బోర్డు అనుమతి తీసుకున్న తర్వాతే తరలించనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే తన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలంటూ తేజస్వీ యాదవ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను తేజస్వీ కోరారు.

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం, ఎయిమ్స్ కు తరలింపు