శభాష్ నారి.. 16 వేల కిలోమీటర్లు గాలిలో వచ్చారు

854

మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు. తాము పురుషులకు తక్కువేం కాదని నిరూపితుస్తున్నారు. జనవరి 5 న ముగ్గురు మహిళ లోకోపైలెట్స్ గూడ్స్ రైల్ నడిపి రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలోని వాసై నుంచి గుజరాత్ లోని వడోదర వరకు 370 కిలోమీటర్ల దూరం గూడ్స్ రైలు నడిపి రికార్డ్ నెలకొల్పారు. ఇక మరో నలుగురు మహిళలు ఏకంగా 16 వేల కిలోమీటర్లు విమానం నడిపి మరో రికార్డ్ సృష్టించారు.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి నలుగురు మహిళ పైలెట్లు విమానాన్ని తీసుకొచ్చారు. ప్రయాణానికి అత్యంత ప్రమాదకరమైన ఉత్తర ధ్రువం గుండా విమానాన్ని తీసుకొచ్చారు ఈ నలుగురు మహిళా పైలెట్లు. మంచుకొండలతో కప్పబడి ఉండే ఈ ప్రాంతంపైనుంచి విమానం తీసుకురావడం అంటే సాహసంతో కూడుకున్న పని. సీనియర్ పురుష పైలెట్స్ మాత్రమే ఉత్తర ధ్రువంపై విమానాలు నడిపిన చరిత్ర ఉంది.

ఇక ఈ నలుగురు మహిళల్లో ఓ తెలుగు పైలెట్ పాపగారి తన్మయి ఉన్నారు. అయితే వీరు నడిపింది పోయింగ్ విమానం ఇది ప్రపంచంలోనే రెండో పొడవాటి విమానం. విరామం లేకుండా 16 వేల కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల్లో చేరుకున్నారు. ఈ ఫీట్ సాధించిన ఈ నలుగురు మహిళ ఫైలెట్ల ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు ఉత్తర ధ్రువం మీదినుంచి రావడం వలన 10 టన్నుల ఇంధనం ఆదా చేశారు. కాగా భౌగోళికంగా బెంగళూరుకి శాన్ ఫ్రాన్సిస్కో అవతలివైపు ఉంటుంది.

శభాష్ నారి.. 16 వేల కిలోమీటర్లు గాలిలో వచ్చారు