కరోనా టీకా అని.. మత్తుమందు ఇచ్చి బంగారం చోరీ

128

నమ్మి ఇంటికి రానిస్తే నట్టేట ముంచింది ఓ నర్సు… కరోనా టీకా అని చెప్పి మత్తు ఇంజక్షన్ ఇచ్చి 8 తులాల బంగారు ఆభరణాలను అపహరించి ఉడాయించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జిల్లెలగూడ లలితానగర్ రోడ్ నెం.. 1 లో నివాసం ఉండే వృద్ధ దంపతులు కుంతాల లక్ష్మణ్ (80) కస్తూరి (70)లకు అనూష అనే (21) మహిళతో పరిచయం ఉంది. ఆమె వృద్ధ దంపతుల ఇంటి పక్కనే ఉంటుండటంతో అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చి ముచ్చటించేది.

వికారాబాద్ కు చెందిన అనూష గతంలో మందమల్లమ్మ సమీపంలోని విశ్వాస్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. కొద్దీ రోజులుగా ఆమె ఉద్యోగానికి వెళ్లడం లేదు. ఆమె భర్త విజయ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు.. మూడు నెలల క్రితం అనూష, విజయ్ దంపతులు ఇంటిని ఖాళీ చేసి అదే కాలనీలోని మరో ఇంట్లో అద్దెకు దిగారు. పాత పరిచయంతో అప్పుడప్పుడు లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది అనూష.. ఈ నేపథ్యంలోనే కస్తూరి ఒంటిపై ఉన్న ఆభరణాలపై కన్నేసింది.

దీంతో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అనూష వచ్చి తాను తిరిగి నర్సుగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యానని, తన దగ్గర కరోనా టీకా ఉన్నాయని ఇద్దరికీ కరోనా టీకా వేస్తానని చెప్పింది. అయితే దినికి వృద్ధ దంపతులు నిరాకరించారు. అయినా బలవంతంగా వారికి మిడోజాలం అనే మత్తు మందును కరోనా టీకాగా నమ్మించి వేయగా వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దింతో అనూష, కస్తూరి వంటిమీద ఉన్న ఆభరణాలను మొత్తం తీసుకోని అక్కడి నుంచి పారిపోయింది.

కొద్దీ సేపటి తర్వాత తేరుకున్న వృద్ధ దంపతులు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెండు గంటల్లో అనూషను పట్టుకొని బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ఈ కిలాడీ లేడి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్కిస్తుంది.

కరోనా టీకా అని.. మత్తుమందు ఇచ్చి బంగారం చోరీ