ట్రాక్టర్ నడుపుకుంటు అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే..

205

రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇందిరా మీనా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ నడిపారు. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ అసెంబ్లీకి వచ్చారు. మహిళ ట్రాక్టర్ నడుపుతుందని రోడ్డుమీద వెళ్లేవారు ఆసక్తిగా చూశారు. పార్కింగ్ ట్రాక్టర్ ను పెట్టి అసెంబ్లీలోకి వెళ్లారు. ఇదిలా ఉంటే గత రెండు నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.. రైతు చట్టాలను రద్దు చెయ్యాలని లక్షలాదిమంది రైతులు ఢిల్లీ సరిహద్దులలో బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీరిని ఢిల్లీలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హిసాత్మక ఘటనలు జరుగుతాయని ఉహించి పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు.

ట్రాక్టర్ నడుపుకుంటు అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే..