కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

332

ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపో వాహనం లారీని ఢీకొంది.. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన 18 మంది అజ్మీర్ దర్గాను దర్శించుకునేందుకు టెంపో వాహనంలో బయలుదేరారు. ఆదివారం తెల్లవారు జామున మాదాపురం గ్రామం వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న టెంపో వాహనం డివైడర్ ను ఢీకొని అవతలి వైపుకు వెళ్ళింది. దింతో అటునుంచి వేగంగా వస్తున్నా లారీ టెంపో వాహనాన్ని ఢీకొంది.. ఈ ప్రమాదంలో టెంపో వాహనం నుజ్జు నుజ్జు అయింది. మృతదేహాలు టెంపో వాహనంలో ఇర్రుక్కు పోయాయి. డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా వాహనం నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. కాగా ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతూన్నాయి. గతేడాది కూడా ఇదే ప్రాంతంలో 8 మంది మృతి చెందారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్

కర్నూలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

ఈ ఘటన చాలా బాధాకరం :- చంద్రబాబు నాయుడు

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం