కర్నూలు జిల్లాలో రోడ్డుపై గర్భిణీ ప్రసవం

104

గర్భిణీ స్త్రీ రోడ్డుపై ప్రసవించిన ఘటన కుర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తపేటకు చెందిన గర్భిణి ఓబులేశమ్మకు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు డోన్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పురుటి నొప్పులు భరించలేక ఓబులేశమ్మ బయటకు పరుగుతీసింది.

దింతో ఆమె ఆసుపత్రి లోపలికి వెళ్లే రోడ్డుపై ప్రసవించింది. దింతో డాక్టర్లు బిడ్డ తల్లిని లోపలికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. రోడ్డుపై జన్మను ఇచ్చినా బిడ్డ తల్లి క్షేమంగా ఉండటంతో డాక్టర్లు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

కర్నూలు జిల్లాలో రోడ్డుపై గర్భిణీ ప్రసవం