కర్నూలు జిల్లాలో ఘోరప్రమాదం

72

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 40 మంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా లారీ వారిపైకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కిస్మస్ ప్రార్థనలకు వెళ్తున్నట్లు సమాచారం.

ప్రమాదం అనంతరం డ్రైవర్ పారిపోయేందుకు యత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక మృతులు సురేఖ(10), ఝాన్సీ(11), వంశీ(10), హర్షవర్ధన్(10)గా గుర్తించారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

కర్నూలు జిల్లాలో ఘోరప్రమాదం