కుప్పంలో కుప్పకూలిన టీడీపీ

277

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ మూడో దశ పంచాయితీ ఎన్నికలు ముగిసాయి. రాష్ట్రంలో మూడు దశల్లో వైసీపీ హావ కనబరిచింది. కొన్ని నియోజకవర్గాల్లోని పంచాయితీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక చిత్తూరు జిల్లాలో వైసీపీ అన్యూహ్యంగా పుంజుకుంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందారు. మూడో విడతలో కుప్పం నియోజకవర్గంలోని 89 గ్రామపంచాయితీలలో పంచాయితీ ఎన్నికలు జరగ్గా 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

టీడీపీ 14 చోట్ల, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది. ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 264 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవాలు 91, వైసీపీ 145, టీడీపీ 28, కాంగ్రెస్ ఒకచోట విజయం సాధించింది. మాజీ సీఎం సొంత నియోజకవర్గంలో టీడీపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ పాగా వేస్తుండటం టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేసే అంశం.

కుప్పంలో కుప్పకూలిన టీడీపీ