ఈ గడ్డమీద పుట్టి నిలబడిన పార్టీలు రెండే రెండు – కేటీఆర్

203

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆవిర్భావం గురించి ప్రస్తావించారు. నాడు దేశంలోనే పెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలను ఎదిరించి కేసీఆర్ బయటకు వచ్చారని తెలిపారు. ఎన్డీయే అధికారంలో ఉన్న రోజుల్లో తెలంగాణ కోసం కేసీఆర్ దైర్యంగా పోరాడారని తెలిపారు. ఆంధ్రరు కేసీఆర్ తో ఏమవుతుందని అనుకున్నారు, కానీ ఆయన వల్లనే తెలంగాణ వచ్చిందని వివరించారు.

ఇక ఈ గడ్డపై పుట్టిన రెండే రెండు పార్టీలు నిలబడగలిగాయని తెలిపారు. అవి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలే అని వివరించారు. మిగతా పార్టీలన్నీ మనుగడ సాగించలేక పోయాయని వివరించారు. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు షర్మిలను ఉద్దేశించినట్లుగా ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రము అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చెయ్యని రైతుంబందు పథకాన్ని అమలు చేసి రైతులకు మేలు జరిగేలా చేశారని వివరించారు.

ఇక పార్టీ సభ్యత్వాల గురించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తన అధికారిక కార్యక్రమాలను పక్కకు పెట్టి పార్టీ సభ్యత్వాలపై దృష్టిపెట్టాలని వివరించారు. పార్టీ సభ్యత్వ నమోదు ఉద్యమంలా సాగాలని తెలిపారు. కొత్త సభ్యత్వాలు నమోదు చేయించడం ప్రతిఒక్క కార్యకర్త బాధ్యతని వివరించారు కేటీఆర్… ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు.

1969 తెలంగాణ తొలిదశ ఉద్యమం వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అణచివేసిందని తెలిపారు. 370 మందిని కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ రెండు కల్లాసిద్ధాంతంలో వ్యవహరించిందని మండిపడ్డారు. కాకినాడ సమావేశంలో ఒక ఓటు, రెండు రాష్ట్రాలని ప్రతిపాదించిన బీజేపీ.. ఆ తర్వాత ఆ నినాదాన్ని విష్మరించిందని తెలిపారు.

ఈ గడ్డమీద పుట్టి నిలబడిన పార్టీలు రెండే రెండు – కేటీఆర్