అది పూర్తైన తర్వాతే కేటీఆర్ కు సీఎం పగ్గాలు

235

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు త్వరలో జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్, తన కుమారుడు కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టనున్నట్లుగా వస్తున్న వార్తలకు బలం చేకూరింది. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక, గెజిటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయనున్నట్లుగా టీఆర్ఎస్ నేతల నుంచి సమాచారం అందుతుంది. ఇక ఇదే సమయంలో యాదాద్రి దేవాలయం ప్రారంభం కూడా ఉండనుంది.

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా యాదాద్రి దేవాలయం ప్రారంభించి, ఆ తర్వాత సీఎం పదవి నుంచి తప్పుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ జరగాలి అంటే మే వరకు పడుతుందని, మే తర్వాతనే కేటీఆర్ కు పట్టాభిషేఖం జరుగుతుందని సమాచారం. ఇక కేటీఆర్ సీఎం కావాలని ఆ పార్టీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. యువనాయకుడు, తెలంగాణ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజాదరణ ఉన్న వ్యక్తి కేటీఆర్ అని సీఎం పదవికి కరెక్ట్ గా సెట్ అవుతారని చెబుతున్నారు.

ఇక నాగార్జున సాగర్ ఉపఎన్నికల బాధ్యత కేటీఆర్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత ఆయా జిల్లాల మంత్రిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చూసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ టీం ని మాత్రం కేటీఆర్ లీడ్ చెయ్యనున్నారు. ఇక సాగర్ లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి జానారెడ్డి అని ప్రకటించింది. కానీ టీఆర్ఎస్ ఇప్పటివరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.

వారిలో రెడ్డి సామజిక వర్గానికి చెందిన నేత ఒకరు ఉండగా, మరొకరు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. నియోజకవర్గంలో లోకల్ లీడర్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ అభ్యర్థి ఎవరు అనేది పార్టీ ప్రకటించలేదు.. మార్చి, లేదా ఏప్రిల్ నెలల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపు తమదే అనే ఆశాభావంతో ఉన్నాయి.

అది పూర్తైన తర్వాతే కేటీఆర్ కు సీఎం పగ్గాలు