అత్తా మామలను చంపిన అల్లుడు

80

కృష్ణా జిల్లాలో దారుణం
కట్నం ఇవ్వలేదని అత్తామామను చంపిన అల్లుడు
అత్తామామను హత్య చేసిన పాస్టర్ నెమలిబాబు
కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామంలో అత్తమామలను హత్య చేశాడు అల్లుడు. కట్నం ఇవ్వలేదని చెప్పి బుధవారం తెల్లవారు జామున ముత్తయ్య, సుగుణమ్మలను కత్తితో గొంతుకోసి హత్యచేశాడు అల్లుడు నెమలిబాబు. కాగా మైనర్ అయిన మనీషాని ప్రేమించి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు నెమలిబాబు. పెళ్లి సమయంలో మనీషా తల్లిదండ్రులు సుగుణమ్మ, ముత్తయ్య కట్నం ఇస్తామని ఒప్పుకున్నారు.

కట్నం ఇవ్వకపోవడంతో మనీషాని వేధింపులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు తాళలేక మనీషా తల్లిగారి ఇంటికి వచ్చింది. మనీషా కోసమని మంగళవారం రాత్రి అత్తగారి ఇంటికి వచ్చిన నెమలిబాబు, బుధవారం తెల్లవారు జామున అత్తమామలను హత్యచేసి పారిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నెమలి బాబును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా యితడు గ్రామ వాలంటీర్ పనిచేస్తూ, ఓ చర్చ్ ని నిర్వహిస్తున్నాడు.

అత్తా మామలను చంపిన అల్లుడు