కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయి – కోమటిరెడ్డి

1419

కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్టుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రాఘవరెడ్డి అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ పోయే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

కాంగ్రెస్ నాయకులపై సీఎం కేసీఆర్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పరిపాలన రజాకారుల పాలన కంటే ఘోరంగా ఉందన్నారు. కేసీఆర్ పాలన కంటే రజాకారుల పాలన భేష్ అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.