పీసీసీ ఇవ్వాలని కోరా: ఎంపీ కోమటిరెడ్డి

70

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. అధ్యక్షుడి పదవికి పలువురు సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు.. హైకమాండ్‌ నుంచి వచ్చిన ప్రతినిధి పార్టీలో ప్రతిఒక్కరి అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ గురువారం గాంధీ భవన్‌లో మరోసారి కోర్‌కమిటీ నేతలతో సమావేశమయ్యారు.

ఏఐసీసీ సభ్యులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌ బేరర్స్‌తో ఆయన భేటీ కానున్నారు. అయితే పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్‌ను కోరినట్టు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని.. తనకు ఇస్తే పార్టీలో బలోపేతం చేస్తానని అధిష్టానానికి చెప్పారు.