ఈ నెల 20 నుంచి కోమటిరెడ్డి పాదయాత్ర

771

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్రల బాట పట్టింది.. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ నేతలు, ఈ నేపథ్యంలోనే రాజీవ్ రైతు భరోసా యాత్ర పేరుతొ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టారు. మరో వైపు కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు.. ఇక మరో ఇద్దరు నేతలు పాదయాత్రను మొదలు పెట్టనున్నారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిబ్రవరి 20 నుంచి ప్రాజెక్టుల సాధన యాత్ర పేరుతో పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు పాదయాత్ర అనుమతి కోరుతూ ఈసీకి లేఖరాశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఎల్‌బీసీ టన్నల్‌ నుంచి జలసౌధ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేయనున్నట్లుగా ప్రకటించారు. అయితే తేదీ మాత్రం ప్రకటించలేదు.

కాంగ్రెస్ నేతలు రాష్ట్రం మొత్తం కలియదిరుగుతు క్యాడర్ జోష్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో చాలామంది కార్యకర్తలు, ఇటు టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లలేక సొంతపార్టీలోనే ఉంటూ అప్పుడప్పుడు పార్టీ కార్యలాపాల్లో పాల్గొంటున్నారు. అటువంటి వారికి తాము అండగా ఉన్నామనే చెప్పే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టినట్లు తెలుస్తుంది. అయితే పలు సమస్యలను ఎంచుకొని పాదయాత్ర చేస్తున్నప్పటికీ అసలు ఉద్దేశంతో మాత్రం గ్రామస్థాయిలోని కార్యకర్తలను కలిసేందుకే అని అర్ధమవుతుంది.

ఈ నెల 20 నుంచి కోమటిరెడ్డి పాదయాత్ర