కోహ్లీ తీరును తప్పు పడుతున్న సీనియర్లు

59

టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ నుంచి భారత్ చేరుకున్నారు. కోహ్లీ సతీమణి అనుష్కా శర్మ త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దింతో ఆయన అనుష్క పక్కన ఉండాలనే ఉద్దేశంతో పర్యటన మధ్యలోనే ఇండియాకు వచ్చారు. అయితే కోహ్లీ తిరిగి రావడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. జట్టును ఆలా వదిలేసి రావడం మంచి నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. ఆ స్థానంలో వేరే వారు ఉంటే క్రికెట్ కే ప్రాధాన్యం ఇచ్చేవారిని ప్రముఖ క్రికెట్ కోచ్ ఏఎన్ శర్మ అన్నారు.

కోహ్లీ స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఉంటే కచ్చితంగా క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వచ్చేవాడు కాదని ఓ క్రీడా ఛానల్‌తో అన్నారు. టీం ఇండియా కెప్టెన్ తిరిగిరావడం తనకు నచ్చలేదని చెప్పారు. జట్టుతోనే ఉండి మిగిలిన టెస్టుల్లో ఆస్ట్రేలియాతో పోరాడి ఉంటే బాగుండేదని తెలిపారు. కోహ్లీ స్థానంలో తానుంటే కచ్చితంగా దేశం తరఫున ఆడేందుకే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను ఆపేందుకు బీసీసీఐకి ఎటువంటి అధికారాలు లేవని, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులను తాను అర్థం చేసుకుంటానని అన్నారు.

ఇక భారత్ ఇప్పటికే తోలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. మరో మూడు టెస్టులు మిగిలి ఉన్నాయి. శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. మిగిలిన మూడు టెస్టులకు అజింక్య రహానే కెప్టెన్ గా వ్యవహరిస్తారు. మూడో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తారు. కాగా మూడో టెస్ట్ మ్యాచ్ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇక చివరి టెస్ట్ జనవరి 19 తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. చివరి రెండు టెస్టుల్లో రోహిత్ ఆడనున్నారు.

కోహ్లీ తీరును తప్పు పడుతున్న సీనియర్లు