మోడీని వెనక్కు నెట్టిన కోహ్లీ.. ప్రపంచంలో 14వ స్థానం

95

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇన్‌స్టాగ్రామ్ లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ప్రపంచంలోనే 14వ స్థానంలో నిలిచారు కోహ్లీ. ‘హైప్‌ ఆడిటర్‌’ అనే ప్రపంచవ్యాప్త సమాచార సేకరణ, విశ్లేషణా సంస్థ చేసిన సర్వేలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో విరాట్‌ 14వ స్థానంలో నిలిచాడని వెల్లడైంది.

భారత్ ప్రధాని మోడీ కంటే విరాట్ ముందు ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ 21వ స్థానంలో ఉండగా, కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ 26వ స్థానంలో నిలిచారని ఆ సంస్థ వెల్లడించింది. దీంతో భారత్‌ తరఫున టీమ్‌ఇండియా సారథే అగ్రస్థానంలో నిలిచాడని అర్థమవుతోంది. ‘హైప్‌ ఆడిటర్‌’ విడుదల చేసిన జాబితాలో ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానాల్లో ఉన్నారు.

ఇక ఈ జాబితాలోప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కీలియజెనెర్ మొదటి స్థానంలో నిలువగా, ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో రెండవ స్థానంలో నిలిచారు, లియోనెల్‌ మెస్సీ మూడో స్థానంలో నిలిచాడని చెప్పింది. భారత్‌ తరఫున కోహ్లీ, మోదీ, అనుష్క తర్వాత మరో బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణే 49వ స్థానంలో నిలిచారని వివరించింది.

మోడీని వెనక్కు నెట్టిన కోహ్లీ.. ప్రపంచంలో 14వ స్థానం