కటకటాలపాలైన పందెం కోళ్లు.. 20 రోజులుగా లాకప్ లోనే..

411

ఊర్లో స్వేచ్ఛగా తిరుగుతూ.. దొరికిన గింజలను తింటూ పూట గడిపే కోళ్లు పోలీస్ స్టేషన్ లాకప్ లో రోజులు గడుపుతున్నాయి. పోలీసులు వేసిన గింజలు తింటూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాయి. ఎవరో చేసిన తప్పుకు స్టేషన్ లో శిక్ష అనుభవిస్తున్నాయి పందెం కోళ్లు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామంలో కొందరు యువకులతో కలిసి ఆంధ్ర ప్రాంతపు యువకులు కోడిపందాలు ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కోడిపందేలు ఆడుతున్న ప్రదేశానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

నగదు, రెండు కోళ్లను అదుపులోకి తీసుకోని స్టేషన్ లో పెట్టారు. అయితే ఈ ఘటన జరిగి 20 రోజులు అవుతుంది అప్పటి నుంచి కోళ్లు ముదిగొండ పోలీస్ స్టేషన్ లాకప్ లోనే ఉంటున్నాయి. స్టేషన్ కి వచ్చిన వారంతా కోళ్లను చూసి నవ్వుతున్నారు. గత జన్మలో జైలు శిక్ష తప్పించుకొని ఉంటాయి. అందుకే ఈ జన్మలో పోలీస్ స్టేషన్ కి వచ్చాయంటున్నారు. ఇక వీటికి స్టేషన్ సిబ్బందే ఆహారం నీళ్లు అందిస్తున్నారు. కోర్టు తీర్పు ఇచ్చే వరకు కోళ్లను విడిచిపెట్టమని ముదిగొండ ఎస్ఐ మీడియాకు తెలిపారు. ఇక కోళ్లు బిక్కుబిక్కుమంటూ స్టేషన్ లాకప్ లోనే రోజులు గడుపుతున్నాయి.

కటకటాలపాలైన పందెం కోళ్లు.. 20 రోజులుగా లాకప్ లోనే..