పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తొలగింపు.. తమిళిసైకి అదనపు బాధ్యతలు

162

పాండిచ్చేరి రాజకీయం అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యే రాజీనామా చేశారు. తాజాగా యానాం ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావు కూడా రాజీనామా చేశారు. కాగా మల్లాది స్వతంత్ర అభ్యర్థిగా అభ్యర్థిగా రెండు సార్లు గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. యానాం నుంచి అత్యధిక మెజారితో గెలిచి రికార్డు సృష్టించాడు. అయితే మల్లాది కాంగ్రెస్ పార్టీని వదలడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ప్రభుత్వం కూలిపోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని తొలగించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది పాండిచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్ బేడీని తొలగించినట్లు తెలుస్తుంది. లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని పాండిచ్చేరి రాజకీయాల్లోకి దించబోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను తొలగించి, తమిళిసైకి బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తుంది. లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ పాండిచ్చేరిలో మంచి పేరు సంపాదించారు. ఒక్కరే పాండిచ్చేరిలో తిరిగేవారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారు. బీజేపీ ఇక్కడ ఈమెను రంగంలోకి దింపి అధికారం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తొలగింపు.. తమిళిసైకి అదనపు బాధ్యతలు