నిద్రలో మూత్రం పోశాడని ఐదేళ్ల బాలుడిని చంపేసింది!

151

చంటి పిల్లలంటే పక్క తడిపేయడం చాలా సాధారణ విషయం. అందుకే డైపర్స్ ఉపయోగిస్తారు. కానీ ఐదేళ్ల పిల్లాడు నిద్రలో మూత్రం పోసి బెడ్ తడిపేశాడని ఓ మహిళ గొంతునులిమి చంపేసింది. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌రూక్కాబాద్‌లో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. య‌శ్ ప్ర‌తాప్‌ అనే బాలుడు త‌ల్లి మూడేళ్ల క్రితం చ‌నిపోయింది. దీంతో ఆ బాలుడిని ద‌గ్గ‌రి బంధువులైన నీర‌జ్, శైలేంద్ర‌సింగ్ అనే వారి‌ ఇంటి వ‌ద్ద తండ్రి వ‌దిలిపెట్టాడు. బాలుడికి నిద్రలో మూత్రం పోయడం అలవాటు.

ఈ క్ర‌మంలో ప్రతాప్ మంగ‌ళ‌వారం రాత్రి బెడ్‌పై మూత్రం పోయ‌డంతో నీర‌జ్‌కు కోప‌మొచ్చి బాలుడి గొంతునులిమి చంపేసింది. ఆ త‌ర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా గ్రామానికి స‌మీపంలో ఉన్న అట‌వీ ప్రాంతంలో మృత‌దేహాన్ని పూడ్చి పెట్టింది. నీరజ్ భర్త శైలేంద్రసింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నీరజ్ వెంట బయటకి వెళ్లిన బాలుడు ప్రతాప్ ను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సీసీటీవీ పరీశీలించగా నీరజ్ ఒక్కటే బయటికి వెళ్లగా వెంట బాలుడు లేదని నిర్ధారించుకున్నారు.

పోలీస్ విచారణలో మొదట కిడ్నాప్ చేశారని చెప్పిన నీరజ్ ఆ తర్వాత మూత్రం పోశాడని ఇంట్లో పెట్టి తాళం వేశానని.. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో లేడని మాట మార్చింది. దీంతో అనుమానించిన పోలీసులు తనదైన శైలిలో విచారించడంతో తానే గొంతునులిమి చంపినట్లుగా నీరజ్ నేరం ఒప్పుకుంది. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని చూపించడంతో బాలుడు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపించారు.

నిద్రలో మూత్రం పోశాడని ఐదేళ్ల బాలుడిని చంపేసింది!