ఖమ్మం హత్యకేసులో మరోదారుణం

357

ఖమ్మం జిల్లాలో నాగశేషురెడ్డి అనే వ్యక్తి భార్యను హత్యచేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. భార్య నవ్యరెడ్డికి మత్తుమందు కలిపిన నీళ్లు ఇచ్చిన నాగశేషురెడ్డి, అనంతరం ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం నవ్యరెడ్డి ఫోన్ నుంచి తండ్రికిసందేశం పంపాడు.. బీటెక్ లో బ్యాక్ లాగ్స్ ఉండటం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా సందేశం పంపాడు నాగశేషురెడ్డి. అయితే నాగశేషురెడ్డి ఇలా చేయడానికి కారణం మరొకరితో ప్రేమలో ఉండటమే అని తెలుస్తుంది. మేనమామ కూతురు వెనీలాతో ప్రేమలో ఉన్న నాగశేషుకు నవ్యరెడ్డితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే రెండు నెలల తర్వాత హత్యచేశాడు.. ప్రియురాలు వెనీలాను పెళ్లి చేసుకునేందుకు అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే నాగశేషురెడ్డి ప్రేమించిన వెనీలా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. నాగశేషురెడ్డి చేసిన పనికి మనస్తాపానికి గురైన వెనీలా శనివారం ఖమ్మం జిల్లా తొండలగోపవరం వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. దింతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక నిందితుడు నాగశేషురెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడిపై, sec 302, 201 కింద కేసు నమోదు చేశారు. అయితే నవ్యరెడ్డి, వెనీలా ఇద్దరు నాగశేషురెడ్డి మేనమామ కూతుర్లే..

ఖమ్మం హత్యకేసులో మరోదారుణం