ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య

72

ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. ప్రత్యర్థి కత్తితో దాడి చెయ్యడంతో తీవ్ర గాయాలపాలైన బీజేపీ నేత నెలవెళ్లి రామారావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామారావు హత్య జిల్లాలో కలకలం రేపింది. కాగా రామారావు ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పథకం ప్రకారం రామారావుపై ప్రత్యర్థి విచక్షణ రహితంగా దాడి చేశారు దింతో తీవ్ర రక్తస్రావం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి ఘటనపై విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

బీజేపీ నేత హత్యపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. బీజేపీ నేతపై ఇటువంటివి జరిగితే సహించేది లేదని వ్యాఖ్యానించారు. కాగా శుక్రవారం బండి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎవరైనా దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు కూడా రాలేరని హెచ్చరించారు.. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఖమ్మంలో బీజేపీ నేత దారుణ హత్య