KGF2: రిలీజ్ డేట్ ఫిక్స్.. రాఖీ భాయ్ ఆయేగా!

369

KGF2: ఏడాది కాలం కరోనాలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. లోకమంతా లాక్ డౌన్ దెబ్బకు కుదేలైనట్లే సినిమాలు కూడా ల్యాబులకే పరిమితమయ్యాయి. ఇక సగంలో ఆగిన షూటింగ్స్ సైతం ఇప్పుడు మళ్ళీ ముమ్మరంగా మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా థియేటర్ లోకి వెళ్లి సినిమాలు చూడడం మొదలు పెడుతున్నారు. దీంతో వరసపెట్టి సినిమా విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. పైగా క్రేజ్ ఉన్న ప్రాజెక్టులైతే పెద్దగా గాబరా పడాల్సిన పరిస్థితి కూడా ఉండదు. అందుకే ఆ ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీ అని లేకుండా సౌత్ నుండి నార్త్ వరకు వరస సినిమాల విడుదల తేదీలు వస్తున్నాయి.

కన్నడ సినిమాగా మొదలై పాన్ ఇండియా సినిమాగా భారీ వసూళ్లు చేసిన కేజీఎఫ్ సినిమా అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యాష్ పాన్ ఇండియా స్టార్స్ కాగా.. వారి కాంబినేషన్ లో వచ్చే కేజీఎఫ్ 2 సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఇండియన్ అన్ని బాషలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ మధ్యనే విడుదల చేసిన టీజర్ మరోసారి దుమ్మురేపింది. మొత్తంగా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.

సినిమా ఎప్పుడొస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు కేజీఎఫ్ అభిమానులు. వారి అందరి ఎదురు చూపులకు తెరదించేస్తూ జులై 16న సినిమా విడుదల కానుందని యూనిట్ ప్రకటించేసింది. దీంతో పాటు ఒక పోస్టర్ కూడా విడుదల చేయగా ఇందులో యాష్ గన్ చేతబట్టి అగ్రెసివ్ లుక్ లో కనిపించడం అభిమానులను మరింత ఊరిస్తుంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమాను తెలుగు హక్కులను ఓ బడా నిర్మాత 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.