కన్నడ స్టార్ యశ్ కి ఉన్న కార్లు ఎన్నో తెలుసా?

182

కేజీయఫ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు చేరువైన యశ్.. ప్రస్తుతం ‘కె.జి.యఫ్‌: చాప్టర్‌2’లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది.. ఇదిలా ఉంటే హీరో యశ్ కి కార్లంటే చాలా ప్రేమ అంట.. ఖరీదైన కార్లలో తిరిగేందుకు యశ్ ఆసక్తి చూపుతారని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు చెబుతుంటారు. అయితే కార్లంటే ఇష్టపడే యశ్ టాప్ బ్రాండ్, హైఎండ్ కార్లను కొనేశారట. ఒకోకరు విలువ కోటి రూపాయల పైనే ఉంటుంది.

క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఇక కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వీటిలోని వెళ్తారట యశ్.. బీఎమ్‌డబ్ల్యు 520డీని ఎక్కువగా ఇష్టపడతారట. ఇక సినిమాల విషయానికి వస్తే.. యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ‘కె.జి.యఫ్‌: చాప్టర్‌2” సినిమా టీజర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక.

ప్రతినాయకుడు అధీరా పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తుండగా..రవీనా టాండన్, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని దక్షిణాదితో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమా జులై 16, 2021న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కేజీయఫ్ చిత్రం సూపర్ డూపర్ కిట్ అయిన విషయం తెలిసిందే.. ఈ సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.. అవే అంచనాలతో ‘కె.జి.యఫ్‌: చాప్టర్‌2’ ను తెరకెక్కిస్తున్నారు.

కన్నడ స్టార్ యశ్ కి ఉన్న కార్లు ఎన్నో తెలుసా?