కిలో టమోటా ఒక్క రూపాయి

77

కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్న చందాన తయారైంది టమోటో రైతు పరిస్థితి, నిన్నమొన్నటివరకు 40 రూపాయలు ఉన్న ధర దారుణంగా పడిపోయాయి. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కిలో టమోటా ఒక్క రూపాయకు అడుగుతున్నారు దళారులు. ఇక హైదరాబాద్ తో పాటు మరికొన్ని పట్టణాల్లో 40 రూపాయలుగా ఉంది. కానీ రైతుల వద్ద దళారులు రూపాయికే కొంటున్నారు. దింతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేసేది ఏమి లేక అక్కడే వదిలేసి వెళ్తున్నారు.

రవాణా ఛార్జీలకు కూడా డబ్బు రావడం లేదని వాపోతున్నారు రైతులు. ఈ విధంగా ఉంటే ఎలా పండించగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. టమోటా 40 రూపాయలు పలుకుతుండగా, ఆలుగడ్డ 60 రూపాయలుగా ఉంది. ఉల్లిగడ్డ కూడా 40 వరకు పలుకుతుంది. నగరంలో రేట్లు అధికంగా ఉన్నా, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు.

కిలో టమోటా ఒక్క రూపాయి