జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై రాళ్లురువ్విన కేతిరెడ్డి అనుచరులు!

81

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటివద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి అనుచరులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జేసీ నివాసంపై రాళ్లు రువ్వారు అనుచరులు.. ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబసభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ ఆగ్రహం చెందిన అనుచరులు.. జేసీ ఆఫీసులో పనిచేసే కిరణ్ పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దీంతో జేసీ వర్గం కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తుంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పొలిసు బందోబస్తు ఏర్పాటు చేశారు.