సంక్రాంతి శుభాకాంక్షలతో కెన్నడీ క్లబ్ ఫస్ట్ లుక్ విడుదల

947

కొత్తరకం కథనంలో క్రీడల నేపధ్యంలో శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై శశి కుమార్, భారతి రాజా, మీనాక్షి గోవిందరాజన్, సూరి ప్రధాన పాత్రలో సుశీంద్రన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న క్రీడా చిత్రం ‘కెనడి క్లబ్’.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా లేటెస్ట్‌గా విడుదల చేసింది చిత్రయూనిట్. పల్లెటూరి కథతో కబడ్డీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించింది.

ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఉద్ధేశ్యంతో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై విడుదల చేయటానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.