రేపు ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్

83

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే వుండనున్నట్టు సమాచారం. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి మాట్లాడతారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతలంతా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మళ్లీ వారితోనే కేసీఆర్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీలో ఎల్లుండి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమిపూజ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతుండడం ఇదే తొలిసారి.