ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయిన కేసీఆర్

71

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. డిసెంబర్ రెండొవ వారంలో ఢిల్లీ టూర్ కి వెళ్లిన కేసీఆర్ అనంతరం ఫామ్ హౌస్ కి వెళ్లారు. తిరిగి 27 తేదీ ప్రగతి భవన్ కు వచ్చారు.. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలపై చర్చించారు కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ పథకంపై అధికారులతో చర్చించారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఇక ఈ నేపథ్యంలోనే పలు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు కేసీఆర్. ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, బదిలీ చెయ్యడం వంటి అంశాలపై చర్చించారు. సరళమైన సర్వీసు నిబంధనల రూపాల్పనపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నారు కేసీఆర్. ఇక ఉద్యోగుల రిటైర్మెంట్ రోజే వారికి అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలు వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించారు.

ఇక ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ పీఆర్సి విషయాన్నీ తీసుకురాలేదు. పీఆర్సీ గురించి మాట్లాడకుండానే చర్చలు ముగిసాయి. అయితే, కాసేపట్లో పీఆర్సీ రిపోర్ట్‌ను సీఎస్ సోమేష్ కుమార్‌కు పీఆర్సీ కమిటీ ఛైర్మన్ అందజేయనున్నారు. ఇక, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ముగియడంతో సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయల్దేరి వెళ్లారు. ఇక త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చెయ్యనున్నారు కేసీఆర్.

ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయిన కేసీఆర్