కేసీఆర్ సభకు వెళ్తే రూ. 500 కూలి

60

బుధవారం సీఎం కేసీఆర్ భారీ భహిరంగ సభలో పాల్గొననున్నారు. నల్గొండ జిల్లా హాలియాలో కేసీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సభ కావడంతో ప్రజలను సమీకరించేందుకు పార్టీ శ్రేణులు రెండు మూడు రోజుల నుంచే సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిరోజులు కావడంతో ప్రజలంతా పొలాల్లోనే ఉంటున్నారు. ఇక ఈ సమయంలో సభకు కష్టంగా మారడంతో వారికీ కూలి ఫిక్స్ చేశారు కొందరు నాయకులు. కేసీఆర్ సభకు వస్తే ఐదు వందల రూపాయలు ఇస్తారని ఓ వ్యక్తి మైక్ పట్టుకొని గ్రామంలో తిరుగుతూ క్యాన్వాసింగ్ చేశారు. సదరు వ్యక్తి మైక్ లో చెబుతున్న సమయంలో వేరే వాళ్ళు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు తండ సర్పంచ్ పార్వతీ రామారావు ఈ విధంగా చేయించినట్లుగా తెలుస్తుంది.

కాగా కేసీఆర్ హాజరవుతున్న సభకు 2 లక్షల మంది వస్తారని అంచనా వేశారు అధికారపార్టీ నాయకులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రజలను ఆర్టీసీ బస్సులలో సభా ప్రాంగణానికి తరలిస్తున్నారు. సభకు ప్రజలను తీసుకొచ్చే బాధ్యతను సర్పంచ్ ల చేతిలో పెట్టారు. దింతో వారు రెండు రోజుల నుంచి మీటింగ్ కోసం జనసమీకరణ ప్రారంభించారు. ఇక బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కేసీఆర్ సభకు తరలి వెళ్లారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.. ఈ సభకు పలువురు మంత్రులతోపాటు ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

కేసీఆర్ సభకు వెళ్తే రూ. 500 కూలి