కేసీఆర్ మిత్రుడు మృతి

169

కేసీఆర్ చిన్ననాటి మిత్రుడు కన్నుమూశారు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన తిరునగరి సంపత్ కుమార్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనపై కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా కేసీఆర్, సంపత్ కుమార్ చదువుకునే రోజుల్లో మంచి మిత్రులు.. ఇద్దరు రూంమేట్స్ కూడా.. గతంలో సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఉత్తర తెలంగాణ భవన్ లో కేసీఆర్ ను కలిశారు సంపత్ కుమార్. ఆయనను చూసి కేసీఆర్ చిరునవ్వు నవ్వి ఆప్యాయతగా హత్తుకున్నారు. ఆయనను అక్కడ ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు పరిచయం కేసీఆర్.. కాగా సంపత్ జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించాడు.

కేసీఆర్ మిత్రుడు మృతి