ఘనంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం

69

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకలు నిర్వహించారు. చరణ్ రెడ్డి, ప్రత్యూష వివాహ వేడుకకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. చర్చిలో చరణ్, ప్రత్యూష ఒక్కటయ్యారు. ఈ వేడుకకు కొద్దిమంది బంధువులు సన్నిహితులు హాజరయ్యారు. కాగా ఆదివారం ప్రత్యూషను పెళ్లి కూతురు చేసేందుకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వయంగా వెళ్లారు. ఆమెతో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు..

ఘనంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం