కేసీఆర్ ఓ కెరటం

387

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ పడిలోకి అడుగుపెట్టారు. 1954 ఫిబ్రవరి 17 న జన్మించారు. పీజీ పూర్తి చేసిన కేసీఆర్ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. మొదట కాంగ్రెస్ యూత్ లీడర్ గా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 1983లో టీడీపీలో చేరారు. టికెట్ పై సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తొలిసారి స్వల్ప ఓట్ల తేడాతో అనంతుల మదన్ మోహన్ చేతిలో ఓటమి చవిచూశారు. 1985 లో సిద్ధిపేట స్థానం నుంచి పోటీచేసి కాంగ్రెస్ నేత టి. మహేందర్ రెడ్డిని ఓడించారు. ఆ తర్వాత ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ ఉపఎన్నికలు సాధారణ ఎన్నికలతో కలుపుకొని 9 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా విజయం సాధించారు.

టీడీపీ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రి పదవి చేశారు. 2000 – 2001 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ నెలలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. నాటి నుంచి తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీకి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లి విజయమ్స్ సాధించారు.

2009 నుంచి తెలంగాణ ఉద్యమం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపించాడు. విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ వెంట నడిచారు. నిరాహార దీక్ష చేపట్టి నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం తెప్పించారు. 2009 డిసెంబర్ 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చిదంబరం ప్రకటన చేశాడు. అయితే తెలంగాణ ఏర్పాటుపై వ్యతిరేకత రావడంతో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దింతో ఉదృతం కేసీఆర్ నుంచి విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళింది. ఓ వైపు కేసీఆర్ , మరో వైపు విద్యార్థులు అందరు కలిసి తెలంగాణ కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్

2014లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దింతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 2, 2014 న తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక రెండో సారి అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఏడాది ముందుగానే వెళ్లి ఘన విజయం సాధించారు. 2019 డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరో 10 ఏళ్లపాటు తానే సీఎంగా ఉంటారని తాజాగా కేసీఆర్ వ్యాఖ్యానించారు..

67 ఏడాదిలోకి అడుగుపెట్టిన కేసీఆర్ గారికి ఊరు వాడ తరపున జన్మదిన శుభాకాంక్షలు

కేసీఆర్ ఓ కెరటం