తెలుగు నటుడి భార్య మృతి

126

నటుడు తాడేపల్లి లక్ష్మికాంతారావు అలియాస్ కత్తి కాంతారావు సతీమణి హైమావతి (87) శుక్రవారం హైదరాబాద్ లో మృతి చెందారు. నగరంలోని మల్లాపూర్ లో ఉంటున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఈమె మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాగా తాడేపల్లి లక్ష్మి కాంతారావు తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు.

కత్తి యుద్ధం చెయ్యడంలో దిట్ట. అందుకే ఆయనను అందరు కత్తి కాంతారావు అనేవారు. అలానే ఆ పేరు పడిపోయింది. కాగా కాంతారావు నటనతోపాటు నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించారు. నిర్మాతగా ఆర్ధికంగా నష్టపోయారు. నటనపై సంపాదించిన ఆస్తులను నిర్మాణంలోకి వచ్చి పోగొట్టుకున్నారు. ఇక ఈయన 2009 మార్చి 22న క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. కాగా వీరి స్వస్థలం ప్రస్తుత సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఓ పల్లెటూరు.. వారి బంధువులు ఇప్పటికే అక్కడే ఉంటున్నారు.

తెలుగు నటుడి భార్య మృతి