Kashibugga SI :13 ఏళ్లకే పెళ్లి.. పట్టుదలతో ఎస్ఐ అయింది.. శిరీష దీనగాధ

175

అనాథ శవాన్ని మోసి అందరి ప్రశంశలు అందుకుంటున్న కాశీబుగ్గ ఎస్ఐ శిరీష జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. 13 ఏళ్లకే ఇంట్లో వారు పెళ్లి చేయడంతో తెలిసి తెలియని వయసులో అత్తింటికి వెళ్లి ఎన్నో బాధలు భరించి, చివరకు పుట్టింటికి చేరి పట్టుబట్టి ప్రభుత్వ కొలువు సాధించింది..

ఒకసారి శిరీష జీవితాల్లోకి తొంగిచూద్దాం

విశాఖపట్నం సిటీ రామాటాకీస్‌ ప్రాంతంలో కొత్తూరు అప్పారావు, రమణమ్మ దంపతులకు శిరీష జన్మించారు. తెలిసి తెలియని వయసులోనే తనకంటే చాలా పెద్ద వయసుగల వ్యక్తికీ ఇచ్చి పెళ్లి చేశారు. జీవితం అంటే ఏంటోతెలియదు. తల్లిదండ్రుల బాధలు చూడలేక వారి మాట కాదనలేక పెళ్లి చేసుకొని అత్తింట్లో అడుగు పెటింది శిరీష. కొద్దీ కాలానికే అక్కడ ఉండలేక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. తిరిగి చదువు మొదలు పెట్టింది. తల్లిదండ్రుల సహకారంతో గ్రాడ్యుయేట్ అయ్యింది శిరీష.. చిన్న నాటి నుంచి శిరీష తండ్రి అప్పారావుకు పోలీస్ అంటే ఇష్టం.. తన కూతురు కూడా పోలీస్ కావాలని కళలు కనేవారు.. కర్తవ్యం సినిమాలో విజయశాంతిలాగా ఆమె పోలీస్ డ్రెస్ వేసుకోవాలని కలలు కన్నారు. ఇక తండ్రి కలను నెరవేర్చేందుకు శిరీష కష్టపడ్డారు.

శిరీష ఉద్యోగం సాధించడం

2014 లో శిరీష ఎక్సైజ్‌ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు. తండ్రి ఆశ మేరకు మద్దిలపాలెం ఎక్సైజ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేశారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో ఓ ఎస్పీ ఆమెను కించపరుస్తూ మాట్లాడారు.. ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ అంటూ మందలించాడు. ఈ మందలింపే శిరీష జీవితాన్ని మలుపు తిప్పింది. కానిస్టేబుల్ గా డ్యూటీ చేసుకుంటూనే ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అయింది. 8 నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి అనంతపురం వెళ్లి పోలీస్ కోచింగ్ తీసుకుంది. రెండేళ్లు కస్టపడి 2019 లో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. ఏ ఎస్పీ అయితే ఆమెను ఆఫ్ట్రాల్ కానిస్టేబుల్ అని అన్నాడో అతడితోనే విశాఖపట్నంలో సన్మానం చేయించుకున్నారు.

ట్రైనింగ్ అనంతరం

ట్రైనింగ్ పూర్తైన తర్వాత నందిగామలో ఎస్పైగా మొదటి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ సరైన వసతులు కూడా ఉండవు. అయినా అక్కడికి వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు శిరీష,.. ఈ నేపథ్యంలోనే ఓ 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం పలాస, అడవికొత్తూరు పొలాల్లో ఉందని కంట్రోల్ రూమ్ కి ఫోన్ వెళ్ళింది. దింతో ఆ మహిళ ఎస్ఐ ఓ కానిస్టేబుల్, ఒక హోంగార్డును తన వెంట తీసుకోని పొలాల్లోంచి నడుచుకుంటూ మృతదేహం ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే మృతదేహాన్ని పట్టుకునేందుకు హోంగార్డ్, కానిస్టేబుల్ ఇద్దరు వెనకాడరు.దింతో లలితా చారిటబుల్‌ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో స్ట్రెచర్‌ తీసుకురమ్మని చెప్పానని వివరించారు.

కానిస్టేబుల్ ఆ అనాథ శవాన్ని స్ట్రెచర్ పై వేసి పక్కకు జరిగాడు. ఇక ఆ శవాన్ని మరోవ్యక్తి సాయంతో కిలోమీటర్ మోసుకొవచ్చారు ఎస్ఐ శిరీష.. ఆమె చూపిన మానవత్వం అందరిని కదిలించింది. దింతో శిరీషకు ప్రశంశల వెల్లువ మొదలైంది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా కొందరు వ్యక్తులు ఫోన్ చేసి ఆమెను మెచ్చుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఫోన్ చేసి, అభినందించారు. జిల్లా ఎస్పీ కూడా ఆమెను అభినందించినట్లు తెలిపారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ కూడా ఫోన్ చేసి ఆమెను అభినందించినట్లు శిరీష తెలిపారు.

నెక్స్ట్ టార్గెట్

తానో నిత్యవిద్యార్థిని అని, ప్రతి రోజు చదువుతూనే ఉంటానని, తన లక్ష్యం గ్రూప్ 1 అని, డిఎస్పీ కావడమే తన తదుపరి లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిపారు శిరీష.

Kashibugga SI :13 ఏళ్లకే పెళ్లి.. పట్టుదలతో ఎస్ఐ అయింది.. ఎస్ఐ శిరీష దీనగాధ