శెభాష్ ఎస్ఐ శిరీష : కావిడిక‌ట్టి.. శ‌వాన్ని మోసి..!

195

శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్రేచర్ పై వేసి మరో వ్యక్తి సాయంతో స్వయంగా మోసుకొని వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు మహిళ ఎస్ఐ శిరీష. అయితే అడవికొత్తూరు గ్రామ పొలాల్లో ఓ వృద్ధుడు మృతి చెందినట్లుగా పోలీస్ స్టేషన్ కు సమాచారం వచ్చింది. దింతో వెంటనే అక్కడికి వెళ్లిన ఆమె, వృద్ధుడి మృతదేహాన్ని స్రేచర్ పై వేసి మరో వ్యక్తి సాయంతో రోడ్డుపైకి తీసుకోచ్చారు. అనంతరం లలితా చారిటబుల్ ట్రస్ట్ కు అప్పచెప్పారు. అయితే మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన వారిలో ఎవరు మోసేందుకు ముందుకు రాకపోవడంతో ఎస్ఐ మృతదేహాన్ని మోసి మానవత్వం చాటుకున్నారు. కాగా ప్రస్తుతం ఈమెకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

శెభాష్ ఎస్ఐ శిరీష : కావిడిక‌ట్టి.. శ‌వాన్ని మోసి..!