రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం..!

195

తాజగా కర్ణాటక మంత్రి రమేశ్‌ జార్కిహోళికి సంబందించిన రాసలీలల వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాసలీలల సీడీలు మంగళవారం బయటికి రాగా, బుధవారం మంత్రి రమేశ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే రాసలీలల వీడియోలో ఉన్న మహిళకోసం బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య సంబంధం కొనసాగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఎమ్మెల్యే సదరు మహిళతో వీడియోలు తీయించి వాటిని బయటకు పంపారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఆ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేనా, లేదంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా అనే విషయం తెలియరాలేదు.

రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం..!