Karnataka Minister Ramesh Jarkiholi: సెక్స్ టేప్ కేసు.. మంత్రి పదవికి రాజీనామా!

314

Karnataka Minister Ramesh Jarkiholi: గత రెండు రోజులుగా దేశంలో సంచలనం సృష్టించిన కర్ణాటక మంత్రి అస్లీల వీడియోల వ్యవహారంలో చివరికి మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. క‌ర్నాట‌క‌ బీజేపీ పార్టీకి చెందిన ర‌మేశ్ జార్కోలీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఓ మ‌హిళ‌తో శృంగార‌భ‌రిత సంభాష‌ణ‌లు చేసిన మంత్రి టేపు ఒక‌టి మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారగా.. అందుకు నైతిక బాధ్య‌త‌తో త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు మంత్రి ర‌మేశ్ తెలిపారు. త‌న రాజీనామా లేఖ‌ను సీఎంకు పంపిన మంత్రి త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజం కాదని, నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌ర‌గాల‌ని, నేను నిర్దోషిన‌ని, అందుకే నైతిక బాధ్య‌త వ‌హిస్తూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ మ‌హిళ‌ను మంత్రి రెచ్చ‌గొట్టార‌ని, లైంగిక కోర్కెలు తీర్చాలంటూ ఆ మ‌హిళ‌తో మంత్రి సంభాషించిన‌ట్లు వీడియోలో ఉంది. అస‌భ్య‌క‌ర భంగిమ‌ల్లో ఆ మ‌హిళ‌తో మంత్రి ఉన్న ఫోటోల‌ను కూడా క‌న్న‌డ టీవీ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేశాయి. మహిళకు, మంత్రికి మ‌ధ్య జ‌రిగిన ర‌హ‌స్య సంభాష‌ణ‌కు సంబంధించిన ఆడియో కూడా ఒక‌టి రిలీజైంది. ఉద్యోగం ఇస్తాన‌ని ఆశ చూపుతూ మంత్రి మాట్లాడార‌ని, క‌ర్నాట‌క భ‌వ‌న్ నుంచి మాట్లాడుతున్న నేప‌థ్యంలో నెమ్మ‌దిగా మాట్లాడాలంటూ ఆ మ‌హిళ‌తో మంత్రి పేర్కొన్న ఆడియోను రిలీజ్ చేశారు. అయితే ఆ ఆడియో క్లిప్ ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేదు. కాగా బీజేపీ అధిష్టానమే రమేష్ కు మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించడంతోనే రమేష్ పదవి వదులుకున్నారని కర్ణాటక రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.