భూకంపం కాదు.. పేలింది డైనమైట్..

78

కర్ణాటకలో భారీ పేలుడు సంభవించింది. శివమొగ్గ జిల్లాలో ట్రక్ లో డైనమైట్ తీసుకువెళుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో ట్రక్ లో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.. హునసోడు గ్రామంలోని రైల్వే క్రషర్ ప్రాంతంలో రాత్రి 10.30 గంటల సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది, ఇది శివమొగ్గాలోనే కాకుండా, పొరుగున ఉన్న చిక్కమగలూరు మరియు దావంగెరే జిల్లాల్లో ప్రభావాన్ని చూపించింది. దాంతో భూకంపమేమో అనుకోని ప్రజలు భయపడ్డారు. అయితే డైనమైట్ పేలిందని అధికారులు వెల్లడించారు.