కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఆత్మహత్య!

52

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు.. మంగళవారం ఉదయం కర్ణాటకలోని చిక్కమగళూరుకు సమీపంలో ఉన్న కదూర్ రైల్వే ట్రాక్ పై ఆయన నిర్జీవంగా పడి ఉన్నారు. రైల్వే పోలీసులు గమనించి మృతదేహంతో పాటు సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ధర్మేగౌడ మృతదేహాన్ని షిమోగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మేగౌడ మృతిపై వెస్ట్ ఐజిపి మాట్లాడుతూ, “ఈ విషయం దర్యాప్తులో ఉంది. రైల్వే ట్రాక్ మీద డెత్ నోట్ దొరికింది, కాని దానిలో ఉన్న వివరాలను ఇవ్వలేము.” అని అన్నారు.

కాగా ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో గందరగోళం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ సభ్యులు ధర్మేగౌడను సీటులో నుంచి లాగేశారు. ఈ ఘటనతో మండలిలోనే డిప్యూటీ ఛైర్మన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ధర్మేగౌడ ఆత్మహత్యకు ఇవే కారణాల లేక మరేదైనా వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.