బ్రిటన్ లో ‘కొత్త కరోనా వేరియంట్’.. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ

91

బ్రిటన్ లో కొత్త కరోనావైరస్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న ఆందోళనల మధ్య కర్ణాటక ప్రభుత్వం
కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది. బుధవారం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య రాష్ట్రం కర్ఫ్యూలో ఉంటుందని ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కర్ఫ్యూ జనవరి 2 వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ప్రస్తుతానికి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని యడియరప్ప చెప్పిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన రావడం చర్చనీయాంశం అయింది. కర్ణాటక ప్రభుత్వం ఈ క్రింది మార్గదర్శకాలను జారీ చేసింది..

*యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) నుండి విమానం ద్వారా లేదా ఓడ ద్వారా వచ్చిన ప్రయాణీకులందరూ 72 గంటల్లోపు RT-PCR పరీక్షలు చేయించుకోవాలి..

*అంతర్రాష్ట్ర ప్రయాణానికి నిషేధం లేదు

*10 మరియు 12 తరగతుల విద్యార్థులకు జనవరి 1 నుండి కళాశాలలు మరియు పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి..

ఇదిలావుండగా, కర్ణాటకలో గత 24 గంటల్లో కొత్తగా 1,141 కోవిడ్ -19 కేసులు, 14 సంబంధిత మరణాలు నమోదయ్యాయి, తాజా 1,141 కేసులలో 585 కేసులు బెంగళూరు పట్టణానికి చెందినవి ఉన్నాయి. కొత్త కేసులతో కలిపి మొత్తం అంటువ్యాధుల సంఖ్య 9,11,382 కు, అలాగే మరణాల సంఖ్య 12,029 కు చేరుకుంది.. కోలుకున్న తర్వాత కొత్తగా 1,136 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,32,17,127 నమూనాలను పరీక్షించారు