కర్ణాటకలో భారీ పేలుడు 10 మంది మృతి

73

కర్ణాటకలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. శివమొగ్గ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. పేలుడులో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. పేలుడు తీవ్రత భారీగా ఉంది. సుమారు 50 కిలోమీటర్ల మేర భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. 10:30 సమయంలో ఈ పేలుడు సంభవించింది. శివమొగ్గ పట్టణానికి శివారులో ఉన్న అబ్బళగెరె గ్రామంలో క్వారీ మైనింగ్ కోసం బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

క్వారీలో బ్లాస్టింగ్ కోసం జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తూ ఉంటారు. ఆ జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ట్రక్కులో పేలుడు జరిగింది. శివమొగ్గ, చిక్‌మగళూరు సహా పలు ప్రాంతాల్లో రాత్రి పూట భూ ప్రకంపనలు వచ్చాయంటూ ప్రజలు రాత్రిపూట ఇళ్లలో నుంచి బయటకు వచ్చేశారు. రాత్రంతా రోడ్లపైనే గడిపారు. శివమొగ్గ నుంచి చిక్ మగళూరు వరకు రాత్రంతా జాగారం చేశారు ప్రజలు. పేలుడుకు రెండుకు కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న పలు ఇల్లు బీటలు బారినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు తీవ్రతకు దేవనగరి జిల్లాలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు.

మొత్తం మూడు జిల్లాలపై దీని ప్రభావం కనిపించింది. భారీ బండలను పిండి చేసే జిలెటిన్ స్టిక్స్ తరలిస్తుండగా ఎందుకు పేలాయి అనే దైనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ శివమొగ్గ ఎస్పీ ఘటన స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. దీనికి సంబందించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. కాగా గురువారం సీరం ఇనిస్టిట్యూట్ లో కూడా అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లుగా తెలుస్తుంది.

కర్ణాటకలో భారీ పేలుడు 10 మంది మృతి