కరీంనగర్ లో జాతీయ రహదారిపై ఫౌంటైన్

49

కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి – గాగిల్లాపూర్ గ్రామాల మధ్య జాతీయ రహదారిపై మంగళవారం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. ఈ పైప్ లైన్ నుంచే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా ప్రాంతాలకు మంచి నీరు సరఫరా అవుతుంది. ఈ పైప్ లైన్ లీక్ అవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిద్ధిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. పైప్ లైన్ లీక్ తో జాతీయ రహదారిపై ఫౌంటైన్ తరహా నీళ్లు ఎగసిపడుతున్నాయి.

సుమారు 30 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. రహదారిపై పైప్ లైన్ పగలడంతో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. మరమ్మత్తుల నిమిత్తం ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. రోడ్డుపై నీరు తగ్గడంతో వాహన రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. 20 నిమిషాల సేపు వేల లీటర్ల నీరు రోడ్డుపాలైంది.