కులం కుంపటి.. ఆత్మహత్య యత్నానికి దారితీసింది

306

అభివృద్ధిలో దేశం పరుగులు పెడుతుంది. అంటరాని తనం కూడా దెరమైంది.. కానీ అక్కడక్కడా కుల రక్కసి వేర్లు బయటకు వచ్చి బంధాలను విడదీస్తున్నాయి. ప్రేమికులకు గండంలా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇతరుల మాటలు విని భార్యను పుట్టింటికి పంపాడు. పుట్టింట్లోనే ఉంటున్న మహిళను కులం ప్రస్తావన తెచ్చి దూషించడంతో ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో చోటుచేసుకుంది. వివాహిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.

శ్రీరాములపల్లికి చెందిన చిట్యాల సంధ్యకు కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అన్నె సంతోష్‌తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వేర్వేరు కులాలు కావడంతో 2020 మార్చి 16న ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం సంతోష్ సొంత ఊరు ఉప్పలపల్లి వెళ్లారు. 10 నెలల పాటు వారి కాపురం సజావుగా సాగింది. ఇరుగుపొరుగు మాటలు విన్న సంతోష్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు.

సంతోష్‌ తండ్రి సమ్మయ్య, వారి బంధువులు గుంటి తిరుపతి, కొండయ్యలు కులం పేరుతో సంధ్యను దూషించడం మొదలుపెట్టారు. దీనికితోడు సంతోష్‌ సంధ్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఎన్నాళ్ళున్నా సంతోష్ , భార్య సంధ్యను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఎన్నిసార్లు చెప్పి పంపినా సంధ్యను తీసుకెళ్లేందుకు రాకపోవడంతో ఆమె ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దింతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం పంచాయితీ చేసుకుందామని చెప్పాడు సంతోష్,, గ్రామంలోని పెద్దలను తీసుకోని వస్తానన్న సంతోష్ ఎంతకు రాకపోవడంతో పెళ్లి చేసుకున్న గుడివద్దకే వెళ్లి నిద్ర మాత్రలు వేసుకుంది.

ఆమెను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హుజూ రాబాద్‌ ఫస్ట్‌ క్లాస్‌ అడిషనల్‌ జడ్జి స్వాతిభవాని సంధ్య నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

కులం కుంపటి.. ఆత్మహత్య యత్నానికి దారితీసింది