Karimnagar News : భార్య వేధింపు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన భర్త

128

భార్య వేధింపులు భరించలేక ఓ భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ పరిధి అల్గునూర్‌ శివారులో కాకతీయ కాలువ వద్ద చోటుచేసుకుంది. సోమవారం కాకతీయ కాలువ దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి కొద్దీ సేపు అక్కడే అటు ఇటు తిరిగాడు. అనంతరం కాలువలో దూకాడు.. అటుగా వెళ్తున్న చేపల వ్యాపారి బాలరాజు అతడిని గమనించి కాపాడేందుకు తన బైక్ కి ఉన్న తాడును విసిరాడు. అయితే అతను దానిని పట్టుకోలేదు అలానే కిందికి కొట్టుకొని పోయాడు. వెంటనే చేపల వ్యాపారి అక్కడ ఉన్నవారిని కేకలువేసి సమాచారం అందించారు. దింతో సమీపంలో ఉన్న చిందం శ్రీను, అమర్‌ పరుగుపరుగున వచ్చి తాడు పట్టుకున్నారు. వెంటనే చేపల వ్యాపారి బాలరాజు కాలువలోకి దిగి అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.

బయటకు వచ్చిన తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనది ఆదిలాబాద్‌ జిల్లా కొత్తవాడ అని. తన పేరు వెంకటేష్ అని తెలిపాడు. భార్య తనమాట వినడం లేదని, తనను వేధింపులకు గురి చేస్తుందని వెంకటేష్ తెలిపారు. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను గత కొద్దీ రోజుల క్రితం ఇంట్లోంచి బయటకు వచ్చానని అటు ఇటు తిరుగుతూ కరీంనగర్ చేరుకున్నానని తెలిపాడు. అటు నుంచి కాకతీయ కలువదగ్గరకు వచ్చానని వివరించారు. తనకు ఇంటికి వెళ్లడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వెంకటేష్ ను స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Karimnagar News : భార్య వేధింపు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన భర్త