కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!

105

రాజకీయ నాయకులూ లైంగిక వేధింపుల వ్యవహారాల్లో చిక్కుకోవడం సర్వసాధారణం అయిపొయింది. లైంగిక ఆరోపణలు ఎదురుకున్న వ్యక్తుల్లో కొందరు రాజకీయాలకు దూరం కాగా, మరికొందరు తాము చేస్తున్న మంత్రి పదవులకు కూడా రాజీనామా చేశారు. ఇక తాజాగా మరో మంత్రికి సంబందించిన రాసలీలల వీడియో బయటకు వచ్చింది.. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కర్ణాటకకు చెందిన జలవనరుల శాఖామంత్రి రమేష్ జార్కిహోలి తనను మోసం చేశారని.. బెంగళూరు కు చెందిన ఓ మహిళ ఆరోపణ చేసింది. మంత్రితో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసిన సదరు మహిళ ఆ సీడీలను సహచట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి చేరవేశారు. దింతో దినేశ్ వాటిని టీవీ చానెల్స్ కు అందించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

మంత్రి రమేష్ జార్కిహోలి టీవీ ఛానెళ్ల ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోని వస్తాయని, కేసును ఎదుర్కొంటానని, వెనుకంజ వేయబోనని ప్రకటించారు. మరోవైపు మంత్రి నిజంగా తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. అయితే ఇది హానీట్రాప్ అని పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రికి చెడ్డపేరు తెచ్చేందుకు ఈ విధంగా చేసి ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఇక ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. సీడీకి సంబందించిన పూర్తి వాస్తవాలను త్వరలోనే బయటపెడతామని వివరించారు.

కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!